ABOUT US

“ సమస్యలు.కాం ”

‘సమస్యలు.కాం’, ఏ ఇతర సంస్థలతో ఎలాంటి అనుబంధము లేకుండా స్వతంత్రముగా (Independently) మన రెండు తెలుగు రాష్ట్రల ప్రజలందరికి మానవతావాద (Humanitarian) దృక్పథముతో తన సేవలను అందిస్తుంది.

నిర్మల్ జిల్లా ప్రజల నుండి నేరుగా సమస్యలను సేకరించి మన సమాజం ముందు ఉంచుతుంది – ‘సమస్యలు.కాం’.

ప్రజలు పడే ఇబ్బందులు, బాధలు, జిల్లాలోని సమస్యలు ఇకనుంచి మన అందరి ముందు ఉంటాయి.

మనకున్న “నిత్యావసర సమస్యలైనా ”, “విద్యా సమస్యలైనా”, “ఆరోగ్య సమస్యలైనా”, “రైతుల సమస్యలైనా”, “ఉద్యోగ సమస్యలైనా”, “దీర్ఘకాలిక సమస్యలైనా” మరియు ఏ ఇతర సామాజిక సమస్యలైనా వాటన్నింటిని కూడా మన ప్రభుత్వము దృష్టికి మరియు మన అందరికి దృష్టికి తీసుకోని వచ్చి మనకున్న సమస్యలకు పరిష్కారాన్ని వెతికే ప్రయాసే – ‘సమస్యలు.కాం’.

మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వంతుకు వివిధ పథకాల ద్వారా మన అభివృద్ధికి తోడ్పడినప్పటికి, మనము ఏమి చేస్తే మనలో మార్పువస్తుంది? – అని ప్రశ్నించుకునే సమయమిదని, గుర్తు చేసే ప్రయాసే – ‘సమస్యలు.కాం’.

ఈరోజు మన సమాజంలో, పెద్ద మొత్తంలో “క్రమ శిక్షణ” (Discipline) మరియు “నిజాయితీ” (Honesty) పూర్తిగా లోపించింది, కాబట్టి మనలో ఉన్న లోపాలను, బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకునే సమయమని, ఈ విషయాన్ని మనమందరము తెలుసుకోవాల్సిన అవసరము ఎంతో ఉందని, అప్పుడే పెద్ద మొత్తంలో మనకున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, గుర్తు చేసే ప్రయాసే – ‘సమస్యలు.కాం’.

నిర్మల్ జిల్లా ప్రజల సమస్యలు మన అందరి సమస్యగా భావించి, ఇప్పటివరకు మనము చదివిన చదువుల ద్వారా పొందిన జ్ఞానాన్ని (Acquired Knowledge) ఉపయోగించి, కుల, మత, బీద, బిక్కి, తేడాలు లేకుండా అందరం కలసికట్టుగా, ఆచరణాత్మకంగా పరిష్కారాన్ని వెతుకవలసిన భాద్యత మన అందరిది అని తెలుసుకోవలెను.

ఎందుకంటే;
“మన సామజిక అవగాహనా లోపం వల్ల మన ‘జీవన నాణ్యత’ (Quality of Life), మరియు మన ‘జీవన ప్రామాణికం’ (Standard of Living) రోజు రోజుకు దిగజారిపోతోంది.”

“Our ‘Quality of Life’ and ‘Standard of Living’ are degrading day by day, due to lack of our ‘Social Awareness’.”

ఇకనుంచి మన జీవితంలో ఒక భాగంగా, మన అందరి ముందు – “ సమస్యలు.కాం.”

– ధన్యవాదములు!


SAMASYALU.COM – IS AN ONLINE WEB PORTAL, TOTALLY COMMITTED AND DEDICATED TO SERVE THE PEOPLE OF BOTH THE TELUGU STATES WITH ITS ALTRUISTIC VISION TO IMPROVE THE QUALITY OF OUR LIVES BY BRINGING OUR SOCIAL PROBLEMS TO EVERYBODY’S ATTENTION – WITHOUT ANY DISCRIMINATION.